AMR సంస్థ ఆఫీసు, ఛైర్మన్ మహేష్ రెడ్డి ఇంట్లో ఐటీ శాఖ తనిఖీలు

హైదరాబాద్‌లో   ఐటీ సోదాలు  మరోసారి నిర్వహిస్తోంది. AMR కన్ స్ట్రక్షన్  గ్రూప్‌ సంస్థల్లో  ఎలక్షన్‌ స్పెషల్‌ సెల్‌ తో కలిసి ఐటీ తనిఖీలు చేస్తోంది. AMR గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ మహేష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న ఐటీ శాఖ అధికారులు..మొత్తం 12 చోట్ల సోదాలు చేస్తున్న చేస్తోంది. 
 
ఇటీవలే  కర్ణాటక నుంచి తెలంగాణకు  డబ్బులు తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. రూ. . 3 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును ఐటీ శాఖకు అప్పగించారు.  టాస్క్‌ఫోర్స్‌ సమాచారంతో AMR సంస్థలో  ఐటీ శాఖ  సోదాలు నిర్వహిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి డబ్బులు తెచ్చి ఇక్కడి ఓ రాజకీయ పార్టీకి ఇస్తున్నట్లు ఐటీ శాఖ అనుమానిస్తోంది. ఏ పార్టీ కోసం డబ్బులు తెస్తున్నారనే దానిపై ఐటీ శాఖ ఆరా తీస్తోంది. 

ALSO READ : Kitchen Tip : పెనం మాడిందా.. పరేషాన్ వద్దు