మాదాపూర్, వెలుగు: దుర్గం చెరువులో దూకి ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ కృష్ణ మోహన్ వివరాల ప్రకారం.. ఏపీలోని విజయనగరం ప్రాంతానికి చెందిన చాణిక్య వర్మ(29) ఫ్రెండ్స్‌తో కలిసి మాదాపూర్ చంద్ర నాయక్ తండాలో నివాసం ఉంటున్నాడు. తన ఫ్రెండ్ ఫోన్ నుంచి శనివారం అర్ధరాత్రి దుర్గం చెరువుకు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్లాడు. అనంతరం కేబుల్ బ్రిడ్జి మీద నుంచి చెరువులోకి దూకాడు.
ఆదివారం ఉదయం చాణిక్య వర్మ డెడ్‌బాడీ చెరువులో తేలియాడుతూ కన్పించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్‌బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చాణిక్య వర్మ ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్ చేసుకున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.