సీనియర్ హీరోయిన్ రంభ(Rambha)..కుర్రాళ్ళ గుండెల్లో కొన్నాళ్లు సేద తీరిన ఫేమస్ హీరోయిన్. ఆ ఇంద్రుడి దగ్గర రంభ ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. కానీ, మన తెలుగు కుర్రాళ్లకు మాత్రం కళ్ళ ముందు కనిపించే ఈ రంభ లానే ఉంటుందని ఫిక్స్ అయ్యారు. అప్పట్లోనే పాన్ ఇండియా హీరోయిన్ గా తన స్టామినా ఏంటో నిరూపించిన ఈ హీరోయిన్ సినీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం.
హీరోయిన్ రంభ 1990 వ దశకంలో తన అందంతో..డ్యాన్స్ తో స్టార్ హీరోస్ అందరితో నటించింది. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్ మలయాళం, కన్నడ భాషల్లో నటించి ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఉన్నంత సోషల్ మీడియా..అప్పట్లో ఉండింటే..పాన్ ఇండియా రంభ అని పిలుచుకునేవాళ్ళం.
హీరోయిన్ రంభ తన అందం, అభినయం, డ్యాన్స్ తో ఆకట్టుకుంది. అచ్చం ఫారెన్ బ్యూటీలా కనిపించే రంభ... తెలుగు అమ్మాయి అని చాలా మందికి తెలియదు. విజయవాడలో పుట్టి పెరిగిన ఈ భామ అసలు పేరు విజయలక్ష్మి. అయితే సినిమాల్లోకి వచ్చాక.. ఆమె పేరును రంభగా మార్చారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ఒక ప్రముఖ హీరో మూవీలో యాక్ట్ చేసేందుకు హీరోయిన్ రంభ ఓకే చెప్పిందట. ఇక నుంచి తెలుగు, తమిళ సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా..అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా డైరెక్ట్ చేస్తోన్న యానిమల్ మూవీ విలన్ బాబి డియోల్ హీరోగా నటించే చిత్రంతో ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.
అలాగే తెలుగులో ఒక స్టార్ హీరో మూవీలో కూడా ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ..ఎలాంటి పాత్రలో కనిపిస్తుందనేది మాత్రం క్లారిటీ లేదు.కానీ, డైరెక్టర్స్ మాత్రం తన కోసం..ఒక మంచి ఇంపార్టెన్స్ రోల్స్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రంభ రీ ఎంట్రీ కన్ఫమ్ అయితే మాత్రం..యంగ్ హీరోలకు అక్క లేదా అత్త పాత్రల్లో సెట్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తోన్నాయి.
ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్, హీరోస్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి రాణిస్తున్నారు. తన రీ ఎంట్రీ తో ఒక్క మంచి పాత్రను దక్కించుకుంటే మాత్రం సాలిడ్ గా సెట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తోన్నాయి. రంభ ఫారెన్ హీరోయిన్ లా కనిపించిన గానీ..తను మన తెలుగు అమ్మాయని చాలా మందికి తెలియదు. రంభ అసలు పేరు విజయలక్ష్మీ..పుట్టి పెరిగింది విజయవాడ.
ALSO READ :- ODI World Cup 2023: ప్రమాదంలో బాబర్ అజాం టాప్ ర్యాంక్.. నెంబర్ వన్‌కు చేరువలో గిల్