
ఇండో-–టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
కానిస్టేబుల్(డ్రైవర్) గ్రూప్ 'సి' నాన్-గెజిటెడ్: 458 పోస్టులు (యూఆర్- 195, ఎస్సీ- 74, ఎస్టీ- 37, ఓబీసీ- 110, ఈడబ్ల్యూఎస్- 42)
అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. వయసు 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్లో సూచించిన విధంగా అభ్యర్థులు శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు జులై 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం www.itbpolice.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.