పది రోజుల్లో ట్రైబల్​మ్యూజియాన్ని సిద్ధం చేయండి : ఐటీడీఏ పీవో రాహుల్​

పది రోజుల్లో ట్రైబల్​మ్యూజియాన్ని సిద్ధం చేయండి : ఐటీడీఏ పీవో రాహుల్​
  • ఐటీడీఏ పీవో రాహుల్​

భద్రాచలం, వెలుగు :   ట్రైబల్​మ్యూజియం పనులు పూర్తి చేసి మరో పది రోజుల్లో సిద్ధం చేయాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆదేశించారు. ఆయన సోమవారం మ్యూజియం పనులను పరిశీలించారు. బీచ్​ వాలీబాల్, బాక్స్ క్రికెట్​ గ్రౌండ్, ప్లాస్టరింగ్​పెయింటింగ్, బోటింగ్​కు చేస్తున్న ఏర్పాట్లను ఆయన తనిఖీ చేశారు.

 ఈనెల 20లోపు పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. టూరిస్టులకు కనువిందు చేసి ఆహ్లాదం పంచేలా మ్యూజియం ఉంటుందని చెప్పారు. అనంతరం నిర్వహించిన గిరిజన దర్బారులో పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎన్ని  అర్జీలు వచ్చాయి, ఎన్ని పరిష్కారం అయ్యాయి? పూర్తి నివేదికను అందజేయాలని యూనిట్​ఆఫీసర్లను పీవో ఆదేశించారు.