సింహగర్జన సభ చూసి మందకృష్ణకు మతి భ్రమించింది : జేఏసీ నాయకులు

సింహగర్జన సభ చూసి మందకృష్ణకు మతి భ్రమించింది : జేఏసీ నాయకులు
  • వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విమర్శించే హక్కు ఆయనకు లేదు

బషీర్ బాగ్, వెలుగు: మాలల సింహగర్జన సభను చూసి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మతిభ్రమించి మాట్లాడుతున్నారని మాల సంఘాల జేఏసీ నాయకులు మండిపడ్డారు. మనువాదుల డబ్బులతో మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పెట్టుకునే మందకృష్ణ.. మాలలను మనువాదులు అనడం సిగ్గు చేటన్నారు. సోమవారం హైదరాబాద్ అబిడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సూర్య లోక్ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ చైర్మన్ జి.చెన్నయ్య మాట్లాడారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా మాలల జనాభా ఉన్నప్పటికీ.. అన్ని రంగాల్లో మాలలు అన్యాయానికి గురయ్యారన్నారు. 

మాలలకు అండగా నిలిచిన వివేక్ వెంకటస్వామిని విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదని మండిపడ్డారు. పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పెట్టలేదని.. కానీ వివేక్ వెంకటస్వామి, ఆయన కుమారుడు గడ్డం వంశీకృష్ణ అడ్డుకున్నారని అసత్య ప్రచారం చేసున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణను మాలలు అడ్డుకోవడం లేదని, రాజ్యాంగమే దాన్ని అడ్డుకుంటుందని చెప్పారు. ఇప్పటికైనా ఆయన తన వైఖరి మార్చుకోవాలని, లేకపోతే మాదిగలే మందకృష్ణకు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.