25న కేవీకేకు ఉప రాష్ట్రపతి రాక

25న కేవీకేకు ఉప రాష్ట్రపతి రాక
  • ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్​

కౌడిపల్లి, వెలుగు: మండలంలోని తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రానికి (కేవీకే) ఈ నెల 25న  ఉపరాష్ట్రపతి జగదీశ్​ధన్​ఖడ్​, రాష్ట్ర గవర్నర్​ జిష్ణుదేవ్​వర్మ రానున్నారు. గ్రామీణ వికాస్​ ఫౌండేషన్​ ఏకలవ్య కృషి విజ్ఞన కేంద్రం రైతులకు అందిస్తున్న సేవలను వారు పరిశీలిస్తారు. 

ఈ నేపథ్యంలో శనివారం కలెక్టర్​ రాహుల్​ రాజ్​ కేవీకేలో ఏర్పాట్లను పరిశీలించారు. సేంద్రియ విధానం ద్వారా సాగు చేస్తున్న పంటలు వివరాలు,  రైతులతో ముఖాముఖికి ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్​ కలెక్టర్​ నగేశ్​, కేవీకే సైంటిస్టులు ఉన్నారు.