రాహుల్ గాంధీది బ్రాహ్మణ కుటుంబం : జగ్గారెడ్డి

రాహుల్ గాంధీది బ్రాహ్మణ కుటుంబం : జగ్గారెడ్డి
  • పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటే చరిత్ర.. మహా సంగ్రామం నుంచి వచ్చిన చరిత్ర ఆయన కుటుంబానిదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. రాహుల్​ది బ్రహ్మణ కుటుంబమని, వారు హిందు వులని తెలిపారు. రాహుల్, ఆయన కుటుంబం గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్​కు అవగాహన ఉందో లేదో అర్థం కావడం లేదన్నారు. 

ఆదివారం గాంధీ భవన్​లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ కులం గురించి మాట్లాడ లేదన్నారు. హిందూ ధర్మం ప్రకారం భర్త మతమే భార్యకు వర్తింస్తుందని చెప్పారు. సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ బ్రాహ్మణుడు కాబట్టి ఆమెది బ్రాహ్మణ కుటుంబమే అవుతుందని పేర్కొన్నారు.