మైనర్ బాలుడిపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ 2 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు.
2019 ఏప్రిల్ 4న జిల్లాలోని మల్లాపూర్ సిరిపూర్ గ్రామంలో మైనర్ బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు గోగుల సాయికుమార్ అనే వ్యక్తి మామిడికాయలు తెచ్చుకుందామని చెప్పి గ్రామ శివారులోకి మైనర్ బాలుడిని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపారు. ప్రాసిక్యూషన్ సాక్షులను, శాస్త్రీయ ఆధారాలను సేకరించి జగిత్యాల కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో నేరాన్ని నిర్ధారిస్తూ గోగుల సాయికుమార్ కు 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కోర్టు.