రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత

రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత

ఆమనగల్లు, వెలుగు: అంబేద్కర్  రచించిన రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం కడ్తాల్  మండలం హనుమాస్ పల్లి గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్  యాత్రను ఆయన ప్రారంభించారు. గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతతత్వ శక్తులు రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 

రాజ్యాంగ పరిరక్షణ నినాదం కాదని, ప్రతి ఒక్కరి బాధ్యత అని చాటి చెప్పడానికే దేశవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పి కొట్టారు. కుల గణన చేపట్టి ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తుందని తెలిపారు. మార్కెట్  చైర్మన్  గీత నరసింహ, వైస్  చైర్మన్  భాస్కర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, భిక్యా నాయక్, హనుమా నాయక్, బిచ్యా నాయక్, వెంకటేశ్  పాల్గొన్నారు.