
- దేశ వ్యాప్తంగా అన్ని రాజధానుల్లో యాత్ర
హైదరాబాద్, వెలుగు: డాక్టర్ బీఆర్. అంబేద్కర్ జయంతిని ఆదివారం రాజ్ భవన్లో ఘనంగా నిర్వహించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. అంబేద్కర్ ఐడియాలజీని ఇప్పటి యూత్ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాజ్యంగ నిర్మాతగా అంబేద్కర్ తన జీవితాంతం న్యాయం, సమానత్వం, సాధికారత కోసం కృషి చేశారని కొనియాడారు.
అనంతరం ఎన్ సీసీ క్యాడెట్స్, స్కాట్స్ అండ్ గైడ్స్ చేస్తున్న జై భీమ్ పాదయాత్రను ఆదివారం రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర యువజన, స్పోర్ట్స్ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ర్టాల రాజధానుల్లో ఈ యాత్ర కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, ఎన్ సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సమీర్ శర్మ, భారత్ స్కాట్స్ అండ్ గైడ్స్ స్టేట్ సెక్రటరీ, రిటైర్డ్ ఐపీఎస్ వేణుకుమార్ పాల్గొన్నారు.