IND vs ENG: ఇద్దరు స్పిన్నర్లతో ఓపెనింగ్..ఇంగ్లాండ్ ప్లాన్స్ బయటపెట్టిన అండర్సన్

IND vs ENG: ఇద్దరు స్పిన్నర్లతో ఓపెనింగ్..ఇంగ్లాండ్ ప్లాన్స్ బయటపెట్టిన అండర్సన్

ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ తర్వాత టీమిండియా పూర్తిగా ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ పైనే దృష్టి పెట్టనుంది. 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. సాధారణంగా భారత్ గడ్డపై టెస్టులంటే స్పిన్ కు బాగా అనుకూలిస్తాయి. మన గడ్డపై సిరీస్ గెలవాలంటే దాదాపు అది అసాధ్యమనే చెప్పాలి. ఎంతటి స్టార్ బ్యాటర్లైనా మన స్పిన్ బౌలింగ్ ధాటికి కుదేలవ్వాల్సిందే. భారత గడ్డపై సిరీస్ అంటే ప్రత్యర్ధులు మన స్పిన్ బౌలింగ్ కు భయపడతారు.   

 2012 చివరిసారిగా సొంతగడ్డపై ఓడిపోయిన భారత్ ఈ 11 ఏళ్లలో సొంతగడ్డపై ఓడిపోని రికార్డ్ కంటిన్యూ చేస్తుంది. దీంతో ఇంగ్లాండ్ సిరీస్ కు టీమిండియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. అయితే ఈ సారి ఇంగ్లాండ్ కొత్త ప్రణాళికలతో బరిలోకి దిగుతుందని ఆ జట్టు స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ చెప్పుకొచ్చాడు. భారత్ లో పిచ్ లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయని.. ఇద్దరు స్పిన్నర్లతో ఇంగ్లాండ్ బౌలింగ్ ప్రారంభించవచ్చని సిరీస్ కు ముందే భారత్ కు హింట్ ఇచ్చాడు.   
   
ఇంగ్లాండ్ నలుగురు పేసర్లతోనే భారత్ కు వస్తుంది. ఇక్కడ పిచ్ లు పేస్ కు అనుకూలించకపోయినా రివర్స్ స్వింగ్ తో వికెట్లు రాబట్టవచ్చు. అని ఈ దిగ్గజ క్రికెటర్ ది డైలీ టెలిగ్రాఫ్'తో చెప్పాడు. నెలన్నర పాటు జరగనున్న ఈ టోర్నీలో ఇంగ్లాండ్ అండర్సన్, మార్క్ వుడ్, ఆలీ రాబిన్సన్, అట్కిన్సన్ పేస్ బౌలర్లగా ఎంపికయ్యారు. జాక్ లీచ్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ,షోయబ్ బషీర్ లాంటి యంగ్ స్పిన్నర్లు ఉన్నారు.
     
ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు హైదరాబాద్ లో జరగనుంది. విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాలలో వరుసగా 2,3,4,5 టెస్టులు ఆడాల్సి ఉంది. గత నెలలో ఇంగ్లాండ్ జట్టును ప్రకటించగా.. త్వరలో భారత జట్టుకు ఎంపిక చేస్తారు. ఇప్పటికే బజ్ బాల్ ను కొనసాగిస్తామని చెప్పిన ఇంగ్లీష్ జట్టు భారత్ ను బయపెడుతుందో లేకపోతో వారు తీసుకున్న గోతిలో వారే పెడతారేమో చూడాలి.   

ఇండియా vs ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్

మొదటి టెస్ట్ (జనవరి 25 - జనవరి 29): హైదరాబాద్
రెండో టెస్ట్ (ఫిబ్రవరి 02 - ఫిబ్రవరి 06): విశాఖపట్నం
మూడో టెస్ట్ (ఫిబ్రవరి 15 - ఫిబ్రవరి 19) : రాజ్‌కోట్
నాలుగో టెస్ట్ (ఫిబ్రవరి 23 - ఫిబ్రవరి 27): రాంచీ
ఐదో టెస్ట్(మార్చి 7 - మార్చి 11): ధర్మశాల