ఉపాధి పని ఇలా చేయాలి.. : రిజ్వాన్​ బాషా షేక్​

ఉపాధి పని ఇలా చేయాలి.. : రిజ్వాన్​ బాషా షేక్​

జనగామ అర్బన్/ రఘునాథపల్లి, వెలుగు: ఉపాధి కూలీ పని ఇలా చేయాలి అంటూ జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​ కాసేపు వారితో కలిసి పని చేస్తూ ఉత్సాపరిచారు. మంగళవారం రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరిలో ఆయన ఉపాధి పనులను పరిశీలించి, సమస్యలపై ఆరా తీశారు. వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ​మండల పరిధిలోని నిడిగొండకు చెందిన ఆశా కార్యకర్త మహేశ్వరి ఇటీవల గుండెపోటుతో మృతి చెందింది. 

మండల ఆశాకార్యకర్తలు, ప్రైమరీ హెల్త్​ సెంటర్ల సిబ్బంది, ఆరోగ్యశాఖ ఆఫీసు నుంచి మొత్తం రూ.1.32 లక్షలు మృతురాలు కుటుంబానికి కలెక్టర్​ చేతుల మీదుగా అందజేశారు. అంతకుముందు కలెక్టర్​ జనగామ మున్సిపల్​ పరిధిలో నిర్వహిస్తున్న ఎల్ఆర్ఎస్​ దరఖాస్తుదారుల ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను పరిశీలించారు.  అనంతరం కలెక్టరేట్​లోని మెయిన్​ గేట్​వద్ద సెర్ప్​ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కలెక్టర్​ ప్రారంభించారు.