
జనగామ అర్బన్/ నర్సింహులపేట, వెలుగు : దొడ్డి కొమురయ్య జీవితం స్ఫూర్తిదాయకమని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కళ్లెం కమాన్వద్ద వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీడీవో రవీందర్, బీసీ యువజన వర్కింగ్ ప్రెసిడెంట్చిర్రా వీరస్వామి, కురుమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో యాదవ యూత్ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య ఫ్లెక్సీకి నివాళులర్పించారు.