హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార కేసులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ ముట్టడికి జనసేన కార్యకర్తలు యత్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని జనసేన కార్యకర్తలు ఆరోపించారు. దోషులు ఎంతటివారైనా అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని జనసేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు, అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి.
ఇవి కూడా చదవండి
వారం రోజుల తర్వాతనా స్పందించేది?