జనగామ వ్యవసాయ మార్కెట్​కు నాలుగు రోజులు సెలవులు

జనగామ వ్యవసాయ మార్కెట్​కు నాలుగు రోజులు సెలవులు

జనగామ అర్బన్, వెలుగు: జనగామ వ్యవసాయ మార్కెట్​కు నాలుగు రోజులు సెలవులు ప్రకటించినట్లు జనగామ వ్యవసాయ కమిటీ చైర్మన్​ బనుక శివరాజ్​యాదవ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 29న అమావాస్య, 30న ఉగాది, 31న రంజాన్​, ఏప్రిల్​ 1న రంజాన్​మరుసటి రోజు కూడా సెలవు ఉంటుందని, రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్​కు తీసుకరావద్దని వివరించారు. ఏప్రిల్​ 2 బుధవారం మార్కెట్​ పున:ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.