
జనగామ అర్బన్, వెలుగు: టెన్త్ ఎగ్జామ్స్‌కు స్టూడెంట్లు బాగా ప్రిపేర్కావాలని, ఆందోళనకు గురి కావద్దని, ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన విద్యార్థులకు మండల, జిల్లా స్థాయిలో బహుమానం అందిస్తామని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఈ నెల మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్న నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్హాల్నుంచి జూమ్మీటింగ్ ద్వారా పదో తరగతి పరీక్షలు రాసే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు.
ఈ మీటింగ్ ద్వారా టీచర్లు పరీక్షా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ అంశాల లో విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు. మీటింగ్‌లో అడిషనల్ కలెక్టర్ పింకేశ్‌కుమార్, డీఈవో రమేశ్, ఏసీజీ రవికుమార్, జీసీడీవో గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్ ధర్మకం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కొనసాగుతున్న ఇంటర్ ఎగ్జామ్స్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. సెంటర్లో వసతులపై ఆరా తీశారు. తనిఖీల్లో డీఐఈవో జితేందర్‌రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.