
జనగామ అర్బన్, వెలుగు : పన్నులు చెల్లించి పట్టాణాభివృద్ధికి సహకరించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ బట్టల షాపులో మున్సిపల్ సిబ్బంది చేస్తున్న ఆస్తి పన్ను వసూళ్లను ఆయన గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో సదరు బట్టల షాప్ యజమాని చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని కలెక్టర్ చేతుల మీదుగా కమిషనర్‌కి అందించారు.
కలెక్టర్మాట్లాడుతూ జిల్లాలో గ్రామ పంచాయతీ స్థాయిలో 95 శాతం పన్ను వసూలు జరిగిందని, మున్సిపల్ పరిధిలో ఇప్పటివరకు 44 శాతం పన్ను వసూళ్లు అయ్యాయన్నారు. ఇందుకోసం మున్సిపల్ పరిధిలో 30 యాక్షన్ టీం, స్పెషల్ టీం లను ఏర్పాటు చేశామన్నారు. బకాయిదారులు సకాలంలో పన్ను చెల్లించాన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.