- అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి
- త్వరలో సీఎం చేతుల మీదుగా వర్చువల్‌గా ప్రారంభం
- వచ్చె నెల ఫస్ట్నుంచి క్లాసులు
జనగామ, వెలుగు: జనగామ గవర్నమెంట్నర్సింగ్కాలేజీ ప్రారంభానికి రెడీ అవుతోంది. గతేడాది గవర్నమెంట్ మెడికల్‌కాలేజీ రాగా, ఈ యేడాది నర్సింగ్కాలేజీ పనులు ఊపందుకున్నాయి. ఇటీవల గవర్నమెంట్ఉత్తర్వులు ఇవ్వగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తైంది. కాలేజీలో 52 సీట్లు ఉండగా, 51 మంది స్టూడెంట్లు చేరారు. వీరికి వచ్చే నెల ఫస్ట్ నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ఆదేశాలతో ఏర్పాట్లు
స్పీడందుకున్నాయి.
వర్చువల్‌గా ప్రారంభం..
గవర్నమెంట్నర్సింగ్కాలేజీని ఈనెలాఖరు వరకు సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్పద్ధతిలో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచె హాస్టల్బిల్డింగ్ను ఇందుకోసం కేటాయించి స్టూడెంట్లకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. బిల్డింగ్రెండు అంతస్తులుండగా గ్రౌండ్‌ఫ్లోర్ ను మెడికల్‌కాలేజీ స్టూడెంట్లకు హాస్టల్వసతికి ఉపయోగిస్తున్నారు. రెండో అంతస్తులో నర్సింగ్కాలేజీకి కేటాయించారు. నాలుగు సంవత్సరాలుండే బీఎస్సీ నర్సింగ్కోర్సుకు మొదటి సంవత్సరం వరకు ఈ బిల్డింగ్ఉపయోగపడనుంది. వచ్చే యేడాది వరకు గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న మెడికల్‌కాలేజీ స్టూడెంట్లకు మరోచోట హాస్టల్ఏర్పాటు చేస్తే సెకండ్ఇయర్నర్సింగ్విద్యా బోధనకు ఇక్కడ ఈజీ అవుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, శాశ్వత బిల్డింగ్‌ను ప్రస్తుత జిల్లా కేంద్రం శివారు చంపక్‌హిల్స్‌లోని ఎంసీహెచ్సమీపంలో నిర్మించనుండగా, దాని నిర్మాణం పూర్తయ్యేందుకు టైం పట్టనుంది. దీంతో అప్పటి వరకు ధర్మకంచె బిల్డింగ్‌లోనే నర్సింగ్కాలేజీ కొనసాగనుంది.
అడ్మిషన్లు పూర్తి..
ఇటీవల నిర్వహించిన కౌన్సెలింగ్‌లో అడ్మిషన్లు పూర్తయ్యాయి. మొత్తం 51 మంది స్టూడెంట్లు ఇక్కడికి అలాట్అయ్యారు. నర్సింగ్కాలేజీకి డాక్టర్ గరికసుధను ప్రిన్సిపాల్‌గా, భాగ్యలక్ష్మిని వైస్‌ప్రిన్సిపాల్‌గా నియమించారు. ప్రిన్సిపాల్సుధ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఐదుగురు టీచింగ్ఫ్యాకల్టీని కూడా నియమించారు. మరో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, ఇద్దరు శానిటేషన్వర్కర్లు ఒకటి రెండు రోజుల్లో వస్తారని అధికారులు తెలిపారు. ధర్మకంచె బిల్డింగ్‌లోని రెండో అంతస్తులో పది గదులు ఉండగా, రెండు అడ్మినిస్ట్రేషన్, మిగిలినివి క్లాసులు, ల్యాబ్‌లు, డైనింగ్కోసం ఊపయోగించుకునేలా తీర్చిదిద్దుతున్నారు.
ALSO READ : నైతికత పాటిస్తేనే.. రాజ్యాంగానికి గౌరవం
ఫస్ట్నుంచి క్లాసులు..
నర్సింగ్కాలేజీ పనులు స్పీడ్‌గా జరుగుతున్నాయి. కలెక్టర్ఆదేశాల మేరకు వచ్చే నెల ఫస్ట్నుంచి క్లాసులు మొదలుకానున్నాయి. సీఎం చేతుల మీదుగా వర్చువల్పద్ధతిలో కాలేజీ ప్రారంభించే అవకాశం ఉంది. టీచింగ్ఫ్యాకల్టీ కూడా అందుబాటులోకి వచ్చింది. స్టూడెంట్లకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. - డాక్టర్గరిక సుధ, ప్రిన్సిపాల్, గవర్నమెంట్నర్సింగ్ కాలేజీ, జనగామ