‘ఐసీసీ ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మంత్‌‌‌‌’ అవార్డు రేసులో బుమ్రా

‘ఐసీసీ ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మంత్‌‌‌‌’ అవార్డు రేసులో బుమ్రా

దుబాయ్‌‌‌‌ : ఇండియా స్టార్‌‌‌‌ బౌలర్‌‌‌‌ జస్‌‌‌‌ప్రీత్‌‌‌‌ బుమ్రా.. ‘ఐసీసీ మెన్స్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మంత్‌‌‌‌ ఆఫ్ డిసెంబర్‌‌‌‌’ అవార్డు రేసులో నిలిచాడు. ఆసీస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ ప్యాట్‌‌‌‌ కమిన్స్‌‌‌‌, సౌతాఫ్రికా సీమర్‌‌‌‌ డ్వేన్‌‌‌‌ పీటర్సన్‌‌‌‌ కూడా ఈ అవార్డు కోసం పోటీపడుతున్నారు. గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో బుమ్రా 14.22 యావరేజ్‌‌‌‌తో 22 వికెట్లు తీశాడు. ఇందులో బ్రిస్బేన్‌‌‌‌, మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌ లో జరిగిన టెస్టుల్లో

తొమ్మిది వికెట్లు తీయడంతో ఇండియా బోర్డర్‌‌‌‌–గావస్కర్‌‌‌‌ ట్రోఫీ రేసులోకి రాగలిగింది. ఓవరాల్‌‌‌‌గా ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో బుమ్రా 32 వికెట్లు తీసి టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచాడు. ఆసీస్‌‌‌‌కు 3–1తో సిరీస్‌‌‌‌ అందించిన కమిన్స్‌‌‌‌ మూడు మ్యాచ్‌‌‌‌ల్లో కలిపి 17 వికెట్లు సాధించాడు. అడిలైడ్‌‌‌‌లో (5/57) బెస్ట్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ చూపెట్టాడు.