తెలంగాణ రాష్ట్ర గీతం రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అందెశ్రీ

తెలంగాణ రాష్ట్ర గీతం రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అందెశ్రీ

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, సీఎస్, డీజీపీ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. 

2 నిమిషాల 32 సెకన్ల నిడివితో జయజయహే తెలంగాణ సాంగ్ ను రిలీజ్ చేశారు.  పరేడ్ గ్రౌండ్ వేదికపై నుంచి పాటను వినిపించారు. రాష్ట్ర గీతం ఆవిష్కరణ సమయంలో భావోద్వేగానికి గురయ్యారు గీత రచయిత అందెశ్రీ. ఈ  కార్యక్రమంలో నేతలు, ప్రజలు కరతాళ ధ్వనులు చేశారు. కార్యక్రంలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పాల్గొన్నారు.