జియో పేమెంట్ సొల్యూషన్స్​కు ఆన్‌‌‌‌లైన్ పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్

న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మంగళవారం తన అనుబంధ జియో పేమెంట్ సొల్యూషన్స్ లిమిటెడ్ (జేపీఎస్‌‌‌‌ఎల్)కు ఆర్​బీఐ నుంచి 'ఆన్‌‌‌‌లైన్ పేమెంట్ అగ్రిగేటర్' లైసెన్స్‌‌‌‌ను పొందింది. ఈ నెల 28 నుంచి అమల్లోకి వచ్చేలా పేమెంట్స్​సెటిల్‌‌‌‌మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007లోని సెక్షన్ 7 ప్రకారం 'ఆన్‌‌‌‌లైన్ పేమెంట్​ అగ్రిగేటర్'గా పనిచేయడానికి జేపీఎస్​ఎల్​కు ఆర్​బీఐ అనుమతి ఇచ్చింది.  

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్.. ఇన్వెస్ట్​మెంట్​  ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్​ బ్రోకింగ్, పేమెంట్ బ్యాంక్  పేమెంట్ అగ్రిగేటర్,  పేమెంట్ గేట్‌‌‌‌వే సేవలను అందిస్తోంది.