హైదరాబాద్ టెక్ మహీంద్రాలో జాబ్స్.. ఇవాళే (ఫిబ్రవరి 6, 2025) ఇంటర్వ్యూలు.. ఎక్కడంటే..

హైదరాబాద్ టెక్ మహీంద్రాలో జాబ్స్.. ఇవాళే (ఫిబ్రవరి 6, 2025) ఇంటర్వ్యూలు.. ఎక్కడంటే..

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ఎంప్లాయ్​మెంట్ ఆఫీసర్ వందన తెలిపారు. టెక్ మహీంద్రా కంపెనీలో 100 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గురువారం జాబ్ ​మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 

టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగులు గురువారం ఉదయం 11 గంటలకు మల్లేపల్లి గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలోని జిల్లా ఎంప్లాయ్​మెంట్ ఆఫీసుకు బయోడేటా, సర్టిఫికెట్లతో రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 83284 28933లో సంప్రదించాలని సూచించారు.