
ఇండియన్ నేవీ ఏప్రిల్ 2022 బ్యాచ్ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి సెయిలర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్ 2వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు: 300 అర్హత: మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి.వయసు: 2002 ఏప్రిల్ 1 నుంచి 2005 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి.
జీతభత్యాలు: ట్రైనింగ్ పీరియడ్‌లో నెలకు రూ.14,600 చెల్లిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. కొవిడ్ 19 కారణంగా కేవలం 1500 మంది అభ్యర్థులని మాత్రమే రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌కు పిలుస్తారు. అర్హత సాధించిన అభ్యర్థుల్ని మాత్రమే సెలెక్ట్ చేస్తారు.
ట్రైనింగ్: 12 వారాలు
కోర్సు ప్రారంభం: ఏప్రిల్ 2022
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
చివరి తేదీ: 2 నవంబర్
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in