
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
ఆర్మూర్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు వీడి, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఆదివారం ఆర్మూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలను పెంచి ప్రజలపై భారం మోపిందని ఆరోపించారు. నిరుద్యోగ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు.
తాళ్ల రాంపూర్ లో జరిగిన ఘటనకు నిరసనగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఈ నెల 15, 16 తేదీల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు పెద్ది వెంకట్రా ములు, పైళ్ల ఆశయ్య, బుర్రి ప్రసాద్, బుడుత రవీందర్, వెంకటేశ్వర్లు, ఆర్మూర్ డివిజన్ సీపీఎం కార్యదర్శి వెంకటేష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు.