జస్ట్ మిస్..లేకపోతే తల పగిలేది..(వీడియో)

జస్ట్ మిస్..లేకపోతే తల పగిలేది..(వీడియో)

క్రికెట్లో బౌన్సర్లకు, విచిత్రమైన బంతులకు తలలు పగులకొట్టుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ రాకాసి బౌన్సర్కు ప్రాణమే పోగోట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఓ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ తరహాలనే బుర్ర పగిలిపోయేది. కానీ కొద్దిలో మిస్ అయింది.  ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. 

ఆగస్టు 27వ తేదీ శనివారం కరేబియన్ సూపర్ లీగ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ట్రిన్ బాగో నైట్ రైడర్స్ సెయింట్ లూసియా కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. సెయింట్ లూసియా బ్యాటింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్  12వ ఓవర్ ను డ్వేన్ బ్రావో ఫుల్ టాస్ వేశాడు. ఈ సమయంలో  సెయింట్ లూసియా కింగ్స్ బ్యాటర్ జాన్సన్ చార్లెస్ స్కూప్ షాట్ కు ప్రయత్నించాడు. కానీ బంతి మిస్ అయి హెల్మెట్ కు బలంగా తాకుతుంది. బంతి తగిలిన వెంటనే హెల్మెట్ కిందపడిపోతుంది. అయితే చాకచక్యంగా హెల్మెట్ వికెట్లను తాకకుండా కాలితో అడ్డుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

తలకు గాయమైందా..?

బంతి హెల్మెట్ కు తాకి కిందపడటంతో బ్యాటర్ జాన్సన్ చార్లెస్ తలకు గాయమైందా అని అంతా అనుకున్నారు. సహచర ఆటగాళ్లు సైతం అతని దగ్గరకు వచ్చి పరామర్శించారు. ఆ వెంటనే ఫిజియోలు కూడా జాన్సన్ చార్లెస్ ను పరీక్షించారు. కానీ ఎలాంటి గాయం కాలేదని..ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మ్యాచ్ లో సెయింట్ లూసియా కింగ్స్ బ్యాటర్ జాన్సన్ 31 బంతుల్లో 37 పరుగులు చేయడం విశేషం. 

ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసింది. డూ ప్లెసిస్ హాఫ్ సెంచరీ సాధించగా...జాన్సన్ చార్లెస్ 37, సికందర్ రజా 32 పరుగులతో రాణించారు. ఆ తర్వాత 168 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ట్రిన్ బాగో నైట్ రైడర్స్  14.5 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 54 పరుగుల తేడాతో  సెయింల్ లూసియా కింగ్స్ విజయం సాధించింది.