
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ మరోసారి గాయపడ్డాడు. ఇండియాతో మూడో టెస్టు నాలుగో రోజు ఆటలో ఒకే ఓవర్ వేసిన హేజిల్‌వుడ్ పిక్క కండరాల నొప్పితో ఇబ్బంది పడి గ్రౌండ్ నుంచి వెళ్లిపోయాడు. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు అతనికి స్కానింగ్ నిర్వహించారు. కాగా, హేజిల్‌వుడ్ చివరి రోజు ఆటకు దూరమయ్యాడని, సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టుల్లోనూ అతను బరిలోకి దిగే అవకాశం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం అధికారిక ప్రకటనలో తెలిపింది. గాయం కారణంగా హేజిల్‌వుడ్ పింక్ బాల్ టెస్టు కూడా ఆడలేదు. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగిన స్కాట్ బోలాండ్ చివరి రెండు టెస్టుల్లోనూ హేజిల్‌వుడ్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది.