ENG vs SL 2024: ఇంగ్లాండ్ జట్టులో 6 అడుగుల 7 అంగుళాల బౌలర్

దిగ్గజ పేసర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇంగ్లాండ్ యువ ఫాస్ట్ బౌలర్లను సిద్ధం చేసే పనిలో ఉంది. మాట్ పాట్స్, ఆలీ స్టోన్, అట్కిన్సన్ లాంటి పేసర్లు ఈ మధ్యనే ఇంగ్లాండ్ జట్టులో చోటు సంపాదించారు. తాజాగా మరో పేసర్ ఇంగ్లీష్ జట్టులో చేరాడు. శుక్రవారం(సెప్టెంబర్ 7)  శ్రీలంకతో ప్రారంభమైన మూడో టెస్టులో జోష్ హల్ ఇంగ్లండ్ తరపున అరంగేట్రం చేశాడు. ఇది సాధారణ విషయమే అయినా అతని ఎత్తు  6 అడుగుల 7 అంగుళాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

రెండో టెస్టులో మార్క్ వుడ్ కు గాయం కాగా.. అతని స్థానంలో హల్ స్క్వాడ్ లో చేరాడు. మూడో టెస్టులో పాట్స్ స్థానంలో అతనికి చోటు దక్కింది. ఈ మ్యాచ్ లో వోక్స్, ఆలీ స్టోన్, అట్కిన్సన్ మరో ముగ్గురు పేసర్లు. గత ఏడాది ఫస్ట్‌క్లాస్‌లో అరంగేట్రం చేసిన హల్.. శుక్రవారం (సెప్టెంబర్ 7) తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే ఇంగ్లాండ్ 2-0 తో సిరీస్ గెలుచుకుంది. 

Also Read :- మా ఉద్యమాన్ని దురుద్దేశంతో చూడొద్దు

ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ 15 ఓవర్లలో వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది. ఓపెనర్ లారెన్స్ 5 పరుగులు చేసి త్వరగా పెవిలియన్ కు చేరాడు. ప్రస్తుతం క్రీజ్ లో డకెట్ (51) కెప్టెన్ పోప్ (14) ఉన్నారు. లాహిరు కుమారకు ఒక వికెట్ దక్కింది.