మార్గదర్శి కేసు నుంచి తప్పుకున్న జడ్జి : నర్సింగ్‌‌‌‌‌‌‌‌రావు

మార్గదర్శి కేసు నుంచి తప్పుకున్న జడ్జి : నర్సింగ్‌‌‌‌‌‌‌‌రావు
  • గతంలో ఇదే కేసులో న్యాయవాదిగా పనిచేసిన జస్టిస్‌‌‌‌‌‌‌‌ నర్సింగ్‌‌‌‌‌‌‌‌రావు

హైదరాబాద్, వెలుగు: మార్గదర్శి కేసుల విచారణ నుంచి జస్టిస్‌‌‌‌‌‌‌‌ నర్సింగ్‌‌‌‌‌‌‌‌ రావు తప్పుకున్నారు. గతంలో ఈ కేసులకు న్యాయవాదిగా వ్యవహరించినందున, వీటిపై విచారణ చేపట్టేందుకు నిరాకరించారు. దీంతో విచారణ వాయిదా పడింది. కాగా, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌‌‌‌‌‌‌‌ రూల్స్ ఉల్లంఘన కేసులో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు వేర్వేరుగా కౌంటర్‌‌‌‌‌‌‌‌ పిటిషన్లు దాఖలు చేశాయి. 

మార్గదర్శిపై విచారణ చేపట్టి, క్రిమినల్‌‌‌‌‌‌‌‌ చర్యలకు సూచనలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం కౌంటర్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసింది. ఈ క్రమంలో మార్గదర్శి దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయాలని కోరింది. 5.15 కోట్లు ఉన్న ఎస్క్రో ఖాతాను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు లేదా ఆర్‌‌‌‌‌‌‌‌బీఐకి బదిలీ చేయాలంది. హైకోర్టు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటామని, తీర్పుకు అనుగుణంగా చర్యలు చేపడతామని తెలంగాణ ప్రభుత్వం కూడా కౌంటర్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసింది.