దిశ ఎన్ కౌంటర్ కేసు.. సుప్రీంకోర్టుకు కమిషన్ నివేదిక

దిశ ఎన్ కౌంటర్ కేసులో విచారణ పూర్తయ్యింది. జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఈ కేసులో విచారణ పూర్తి చేసింది. ఈ నెల 28న సుప్రీం కోర్టుకు కమిషన్ నివేదిక సమర్పించనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దిశ కేసు ఎన్ కౌంటర్ లో జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఏర్పాటు అయ్యింది. డిసెంబర్ 12- 2019 లో కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ చైర్మెన్ గా సుప్రీంకోర్టు రిటైర్ట్ జడ్డి జస్టిస్ సిర్పూర్కర్ ను నియమించారు. 47 రోజుల పాటు ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగింది. ఫోరెన్సిక్ నివేదికలు, డాక్యుమెంట్ రికార్డ్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, పోస్ట్ మార్టం రిపోర్ట్స్, సీన్ ఆఫ్ అఫెన్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కమిషన్ సభ్యులు సేకరించారు. మొత్తం 57 మందిని విచారించింది. అడ్వకేట్స్, ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసులు, మాజీ సైబరాబాద్ సీపీ సజ్జనార్, దిశ కుటుంబ సభ్యులు, ఎన్ కౌంటర్ లో చనిపోయిన కుటుంబ సభ్యులను కమిషన్ కలిసి విచారణ చేపట్టింది. 

ఇవి కూడా చదవండి:

బడ్జెట్ సమావేశాల్లో పెగసెస్ పై చర్చ

ప్రభుత్వం 80 శాతం రైతులకు ప్రాధాన్యత