నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. సభ్యులుగా ప్రియాంక్ కనూంగో, డాక్టర్ జస్టిస్ బిద్యుత్ రంజ్ షడంగిలను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ రామసుబ్రమణియన్ స్వస్థలం తమిళనాడులోని మన్నార్గుడి. 1958, జూన్ 30న జన్మించారు. జస్టిస్ రామసుబ్రమణియన్ 2019, సెప్టెంబర్ 23 నుంచి 2023, జూన్ 29 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు.
ఎన్హెచ్ఆర్సీ సభ్యుడిగా నియమితులైన ప్రియాంక్ కనూంగో గతంలో జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఈయన స్వరాష్ట్రం మధ్రప్రదేశ్. మరో సభ్యుడు జస్టిస్ బిద్యుత్ రంజన్ షడంగి స్వరాష్ట్రం ఒడిశా. ఈ ఏడాది జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. అంతకుముందు ఒడిశా హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు.