వానకు..పుస్తకాలు తడిసినయ్

మరికల్​ మండలకేంద్రంలో కొనసాగుతున్న జ్యోతిబా​ఫూలే  నారాయణపేట స్కూల్​లో విద్యార్థుల పుస్తకాలు ఆదివారం రాత్రి కురిసిన వానకు తడిసిపోయాయి. అద్దె భవనంలో కొనసాగుతోన్న బిల్డింగ్​కు కిటికీలు, తలుపులు సరిగా లేకపోవడంతో పుస్తకాలు, బట్టలు తడిసిపోయాయని విద్యార్థులు వాపోయారు.

సోమవారం పుస్తకాలను స్కూల్​ ఆవరణలో ఆరబెట్టుకున్నారు. స్కూల్​లో 6 నుంచి 10వ తరగతి వరకు 440 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పటికైనా సొంత బిల్డింగ్​ నిర్మించాలని కోరుతున్నారు.