Bharateeyudu 2 An Intro : కమ్ బ్యాక్ ఇండియా..భారతీయుడు2 ఇంట్రో టీజర్ రిలీజ్..

మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన శంకర్..మొదట నటుడవ్వాలనుకున్నారు. వసంత రాగం, సీత తదితర సినిమాలతో యాక్టర్‌‌గా కెరీర్‌‌ స్టార్ట్ చేశారు. ఆయన అలాగే కంటిన్యూ అయి ఉంటే దేశం ఓ గొప్ప దర్శకుడిని మిస్ అయిపోయేది. ఆయన నుంచి వచ్చిన చాలా గొప్ప సందేశాత్మక చిత్రాలు చూసేండేవాళ్ళం కాదు.

గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే క్లర్క్ నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు అధికారి వరకు లంచం ఎలా నాటుకుపోయిందో చూపించిన చిత్రం భారతీయుడు. ఇక అప్పటి నుండి సినిమాలోనే కాకుండా బయట కూడా కొన్నాళ్ళు లంచం తీసుకోవాలంటే భయపడే ఆఫీసర్స్ కూడా ఉన్నారంటే దానికి కారణం శంకర్ భారతీయుడు మూవీ. అప్పటికి..ఇప్పటికీ ఈ సినిమా ఓ సెన్సేషన్. అంతేకాకుండా.. లంచగొండితనంతో దేశం ఎలా నాశనమవుతోందో కళ్ళకు కట్టినట్లు చూపించారు శంకర్. 

లేటెస్ట్ గా ఈ మూవీకి సీక్వెల్ గా వస్తోన్న భారతీయుడు 2 (Bharateeyudu 2)తెలుగు ఇంట్రో టీజర్ ను దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రిలీజ్ చేశారు. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. 

1996  భారతీయుడు మూవీలో కమల్ హాసన్ ఇండియా వదిలి విదేశాలకు వెళ్లిపోయినట్లు చూపించారు శంకర్. అలాగే మళ్ళీ ఇండియాలో మళ్ళీ అన్యాయం జరిగితే తప్పకుండా తిరిగి వస్తానని..తనకి మరణం అనేది లేదని చూపించారు.రిలీజ్ చేసిన టీజర్ లో..ఆ ఇంట్రో స్టార్ట్ చేసి భారతీయుడు గుర్తుకు చేసే ప్రయత్నం చేశారు శంకర్. 

అలా విదేశాలకు వెళ్లిపోయిన భారతీయుడిని మళ్ళీ రమ్మంటు దేశంలో కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలు సోషల్ మీడియా లో రిక్వెస్ట్ లు పెడుతుండడం, వారి బాధని తెలుసుకున్న భారతీయుడు మళ్ళీ ఇండియాకి తిరిగి రావడం..వంటి సీన్స్ తో ఇంట్రో చూపించారు. ఒక పేదింటి బిడ్డ జాబ్ లో జాయిన్ అవ్వాలంటే..8 లక్షలు ఇస్తేనే..జాబ్ అంటూ చూపించారు. అలాగే టీజర్ లో కమ్ బ్యాక్ ఇండియాన్.. అంటూ థీమ్ సాంగ్ తో సేనాపతి ఇండియా రావాలంటూ వచ్చే సాంగ్ లిరిక్స్ ఎంతో ఆకట్టుకుంటున్నాయి. 

ఈ ఇంట్రో టీజర్ ను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో పాపులర్‌ సెలబ్రిటీలు రిలీజ్ చేశారు. టీజర్ చివర్లో..కమల్ హాసన్ ఎంట్రీ ఇస్తూ..నమస్తే ఇండియా..భారతీయుడు ఇస్ బ్యాక్..అనే డైలాగ్ తో టీజర్ అదిరిపోయింది. దీంతో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న టీజర్ రిలీజ్ కావడంతో.. భారతీయుడు ఫ్యాన్స్..ఖుషి అవుతున్నారు. 

ALSO READ :- కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం...కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

ఇక ఇండియన్2 సినిమా విషయానికి వస్తే..ఈ సినిమాలో కమల్ కు జోడీగా కాజల్ అగర్వాల్(Kajal agarwal,) నటిస్తున్నారు. హీరో సిద్దార్థ్(Siddarth) కీ రోల్ లో కనిపించనున్న ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్(Anirudh) సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.