సన్నబియ్యం పంపిణీని పరిశీలించిన కలెక్టర్

సన్నబియ్యం పంపిణీని పరిశీలించిన కలెక్టర్

కామారెడ్డి​టౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం రేషన్​ షాపుల్లో సన్న బియ్యం పంపిణీని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ పరిశీలించారు.  వివేకాంద కాలనీలోని రేషన్​ షాపులో తూకాన్ని పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. బియ్యం ఎలా ఉన్నాయి.. తూకం కరెక్ట్​ ఉంటుందా.. అని అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యం ఇస్తున్నందుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.  కలెక్టర్​ వెంట డీఎస్​వో మల్లికార్జునబాబు, తహసీల్దార్ జనార్దన్​ తదితరులు ఉన్నారు.  జిల్లాలోని ఆయా చోట్ల ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్​ బియ్యం పంపిణీ పక్రియను పరిశీలించారు. 

డిస్ట్రిక్​ఇండస్ట్రియల్ కమిటీ మీటింగ్

కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి కలెక్టరేట్​లో బుధవారం కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ డిస్ట్రిక్​ఇండస్ట్రియల్ కమిటీ మీటింగ్​ జరిగింది.  టిప్ రైడ్,  ఎస్​సీపీ స్కీమ్ ఏజెండా అంశాలపై చర్చించారు.  ఈ స్కీమ్​ల కింద 3 అప్లికేషన్లకు సబ్సిడీ రూ. 6 లక్షల 92వేలు ఇచ్చేందుకు ఆమోదించారు. టీఎస్​పీ కింద 14 అప్లికేషన్లకు రూ. 44 లక్షలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో   ఇండస్ట్రియల్​ జిల్లా జీఎం వి.లాలూ,  అధికారులు పాల్గొన్నారు.