క్వాలిటీ సన్న బియ్యం పంపిణీ : ఆశిష్​ సంగ్వాన్

 క్వాలిటీ సన్న బియ్యం పంపిణీ  : ఆశిష్​ సంగ్వాన్
  • కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్

కామారెడ్డి, వెలుగు : తెల్ల రేషన్​ కార్డు లబ్ధిదారులకు క్వాలిటీ సన్న బియ్యం అందిస్తున్నామని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ పేర్కొన్నారు.  గురువారం రామారెడ్డి మండల కేంద్రంలో రేషన్​ షాపులో  సన్న బియ్యం పంపిణీని పరిశీలించారు.  బియ్యం క్వాలిటీని చూసి లబ్ధిదారులతో మాట్లాడారు.  జిల్లాలో ఇప్పటి వరకు 47 శాతం బియ్యం పంపిణీ కంప్లీట్ అయ్యిందన్నారు.

బియ్యం క్వాలిటీతో పాటు, తూకం పరిశీలించాలని అధికారులకు సూచించారు. మండల స్పెషల్​ ఆఫీసర్ విజయ్​కుమార్,   డీసీవో మల్లికార్జునబాబు, డీపీవో మురళీ,  తహసీల్దార్ ఉమాలత,  ఎంపీడీవో తిరుపతి  ఉన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్పీడప్ చేయాలి ..

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్పీడప్​ చేయాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ అధికారులకు సూచించారు.  రామారెడ్డి మండల కేంద్రంలో మాడల్​ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించిన అనంతరం  కన్నాపూర్​ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గుపోసి మార్కవుట్ ఇచ్చారు.  లబ్ధిదారులు వెంటనే ఇండ్ల నిర్మాణం షూరు చేసేలా క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలన చేయాలన్నారు.  హౌజింగ్​ పీడీ విజయపాల్​రెడ్డి, డీఎల్​పీవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.