![అంగన్ వాడీ సెంటర్లలో తనిఖీ చేయాలి : ఆశిశ్ సంగ్వాన్](https://static.v6velugu.com/uploads/2025/02/kamareddy-collector-ashish-sangwan-orders-regular-inspections-of-anganwadi-centers_4KDFYPdTUo.jpg)
కామారెడ్డి టౌన్, వెలుగు: సీడీపీవోలు, సూపర్ వైజర్లు అంగన్వాడీ సెంటర్లలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఐసీడీఎస్పై సంబంధిత అధికారులతో రివ్యూ మీటింగ్ జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. నెలలో కనీసం రెండు సెంటర్లను తనిఖీ చేయాలన్నారు. బాలామృతం సెంటర్లలో పరిసరాల శుభ్రత సరకుల స్టాక్ రిజిస్టర్లు పరిశీలించాలన్నారు. సెంటర్లలో పిల్లల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ వారి సంఖ్య మాత్రం తక్కువగా ఉంటుందని గమనించామన్నారు.
నిర్మాణంలో ఉన్న అంగన్ వాడీ బిల్డింగ్‌లను పూర్తి చేయాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లో సెంటర్లు నడపకూడదన్నారు. కరెంట్ కనెక్షన్ లేని వాటిని గుర్తించి వెంటనే మీటర్లు బిగించాలని విద్యుత్తు శాఖ ఎస్ఈ శ్రవణ్ కుమార్ ను ఆదేశించారు. సెంటర్లకు తాగునీటిని సప్లయ్ చేయాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. జిల్లా ఐసీడీఎస్అధికారి ప్రమీల, విద్యుత్తు శాఖ ఎస్ఈ శ్రవణ్ కుమార్, పంచాయతీరాజ్ ఈఈ దుర్గాప్రసాద్, మిషన్ భగీరథ ఈఈ రమేశ్, అధికారులు పాల్గొన్నారు.