నీటి ఎద్దడి లేకుండా చూడాలి : ఆశిష్​ సంగ్వాన్​

 నీటి ఎద్దడి లేకుండా చూడాలి : ఆశిష్​ సంగ్వాన్​
  • కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​

కామారెడ్డిటౌన్, వెలుగు: జిల్లాలోని గ్రామాలు, టౌన్లలో ఎండకాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని కామారెడ్డి కలెక్టర్​ఆశిష్​ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం తన చాంబర్​లో మిషన్​ భగీరథ అధికారులతో తాగునీటి ఎద్దడిపై రివ్యూ చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పంచాయతీ సిబ్బంది అలర్ట్​గా ఉండాలన్నారు. తాగునీటి స్కీమ్​లకు ఏమైనా రిపేర్​ ఉంటే  చేయించాలన్నారు. పైపులైన్లపై లీకేజీలు అరికట్టాలన్నారు. అధికారులు కో అర్డినేషన్​తో పని చేయాలన్నారు. మిషన్​ భగీరథ ఎస్ఈ రాజేంద్ర కుమార్, అధికారులు స్వప్న, నరేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్​ఆశిష్​ సంగ్వాన్​ పేర్కొన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై స్టేట్​ఎలక్షన్​ అధికారి సుదర్మన్​ రెడ్డి శుక్రవారం ఆయా జిల్లాల అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, బ్యాలట్​బాక్సులు, పోలింగ్​రోజు చేపట్టాల్సిన ఏర్పాట్లు తదితర ఆంశాలపై చర్చించారు. జిల్లాలో గ్రాడ్యుయేట్, టీచర్​ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 54 పోలింగ్​బూత్​లను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్​ తెలిపారు. ఎస్పీ సింధూశర్మ, అడిషనల్ కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్​రెడ్డి, నోడల్​ అధికారులు పాల్గొన్నారు.

రోడ్లపై చెత్త వేయకుండా అవగాహన కల్పించాలి

కామారెడ్డి టౌన్లో రోడ్లపై చెత్తవేయకుండా అవగాహన కల్పించాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్​, రామారెడ్డి రోడ్డు ఏరియాల్లో కలెక్టర్​పర్యటించి, శానిటేషన్ పరిస్థితిని పరిశీలించారు. ఇంటింట చెత్త సేకరణను ప్రతి రోజు నిర్వహించాలన్నారు. ఇండ్ల నుంచి సేకరించిన చెత్తను డంపింగ్​యార్డుకు తరలించాలన్నారు. రోడ్లకు ఇరువైపుల నాలల్లో ఉన్న చెత్తను తొలగించాలన్నారు. ట్యాక్సులు 100 శాతం వసూలు చేయాలని ఆదేశించారు. కమిషనర్​ రాజేందర్​రెడ్డి, డీఈ వేణుగోపాల్, ఏఈ శంకర్​ తదితరులు పాల్గొన్నారు.