వడ్ల కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి

వడ్ల కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి

కామారెడ్డి, వెలుగు : యాసంగి సీజన్ వడ్ల కొనుగోలుకు ఏర్పాట్లు చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు.   గురువారం వడ్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై అధికారులతో మీటింగ్​ నిర్వహించారు. ఈ  సీజన్​లో 4,88,769 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 1,32, 121 మెట్రిక్​ టన్నుల  సన్న రకం వడ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు.   

424 సెంటర్లు ఏర్పాటు చేయాలని ఇందులో 397 సొసైటీలు,  27 మహిళా సంఘాల ఆధ్వర్యంలో సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. సెంటర్లలో గన్నిబ్యాగులు, టార్పాలిన్లు, తేమ శాతం మిషన్ తదితరవి అందుబాటులో ఉంచాలన్నారు.    వడ్ల రవాణాకు సరిపడా వాహనాలను అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్​ విక్టర్,  అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, డీఎం రాజేందర్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్​రెడ్డి,  అగ్రికల్చర్ అధికారి తిరుమల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.