ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు రావద్దు

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు రావద్దు

కామారెడ్డిటౌన్, వెలుగు : ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్​లో ఆయా శాఖల అధికారులు, సిబ్బందితో వడ్ల కొనుగోళ్లపై నిర్వహించిన మీటింగ్​లో కలెక్టర్​ మాట్లాడారు.  జిల్లాలో యాసంగి సీజన్​కు సంబంధించి 6 లక్షల 20వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే వీలుందని,  సెంటర్లలో అమ్మకానికి  5 లక్షల 63 వేల మెట్రిక్​ టన్నుల వడ్లు వస్తాయన్నారు. 446 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.  వరి కోతలు షూరు అయిన ఏరియాల్లో వెంటనే  కొనుగోలు సెంటర్లు తెరవాలన్నారు. 

సెంటర్లలో సరిపడా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు,  ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.  తాగునీటి సౌకర్యంతో పాటు ఓఆర్​ఎస్ ఫ్యాకెట్లను కూడా ఉంచాలన్నారు. కాంట అయిన వెంటనే ట్యాబ్​లో ఎంట్రీ చేయాలని సూచించారు.  24 గంటల్లోగా రైతుల అకౌంట్లలో డబ్బులు పడేలా చూడాలన్నారు.  సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​ విక్టర్​,  సివిల్ సప్లయ్​ డీఎం రాజేందర్,  డీఎస్​వో మల్లికార్జునబాబు,  జిల్లా ట్రాన్స్​పోర్ట్​ అధికారి శ్రీనివాస్​రెడ్డి,  అగ్రికల్చర్​ అధికారి తిరుమల ప్రసాద్,  మార్కెటింగ్​ అధికారిణి రమ్య,   ఐకేపీ, సింగిల్​ విండో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.