విద్యార్థులకు ఏఐపై అవగాహన అవసరం

విద్యార్థులకు ఏఐపై అవగాహన అవసరం

నిజాంసాగర్ (ఎల్లారెడ్డి ), వెలుగు : ఆధునిక కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​ ప్రతి ఒక్క విద్యార్థికి అవగాహన అవసరమని కామారెడ్డి  కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శనివారం అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ ఆధారిత ఎఫ్ఎల్ఎన్ ల్యాబ్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.  ఏ ఎక్స్ ఎల్ ల్యాబ్  గణిత సామర్థ్యాన్ని పెంచుతుందని, విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు.  పాఠశాల అభివృద్ధిలో గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమన్నారు. 

ఎంపీపీ ఆఫీస్​లో మోడల్ ఇందిరమ్మ గృహాన్ని పర్యవేక్షించి నిజాంసాగర్  గ్రామపంచాయతీ  నర్సరీ, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్​ కిరణ్మయి,  డీఈవో  రాజు, జిల్లా క్వాలిటీ కో ఆర్డినేటర్ వేణుగోపాల్, మండల విద్యాశాఖ అధికారులు తిరుపతి రెడ్డి, అమర్ సింగ్, ప్రధానోపాధ్యాయులు రామచందర్, అమ్మ ఆదర్శ పాఠశాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

బోధన్​లో ఏఐ కోర్సులను ప్రారంభించిన డీఈవో.. 

బోధన్ : బోధన్ పట్ణణంలోని మధుమలాంఛ ఉన్నత పాఠశాలలో ఏఐ కోర్సును డీఈవో అశోక్ ప్రారంభించి మాట్లాడారు.  10 కంప్యూటర్లు , హెడ్ ఫోన్స్​, ఇంటర్నెంట్ సదుపాయంతో ఏఐ కోర్సులు ప్రారంభించినట్లు  తెలిపారు. ఆయన వెంట మండల విద్యాధికారి నాగయ్య, కాంప్లెక్స్​ ప్రధానోపాధ్యాయులు ఆరీఫ్​, ప్రధానోపాధ్యాయులు నరేందర్​, ఉపాధ్యాయులు సాయికిరణ్, ప్రీతి, శివతేజ, సాగర్ పాల్గొన్నారు.  

 ఆర్మూర్ మండలంలో..

ఆర్మూర్, వెలుగు : - ఆర్మూర్ మండలంలోని పెర్కిట్, కోమన్ పల్లి, మంథని, అంకాపూర్​, సుర్భిర్యాల్, ఆలూర్ మండలంలోని మచ్చర్ల గ్రామాల్లోని ప్రైమరీ స్కూళ్లలో శనివారం (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఏఐ ఆధారిత బోధన విధానాన్ని ప్రారంభించారు.  వెనుకబడిన (భాష, గణితం) స్టూడెంట్స్​కు, భాషా నైపుణ్యాలు గణిత సామర్థ్యాల మీద పూర్తిస్థాయి అవగాహనకు ఉపయోగడుతుందని ఆర్మూర్​, ఆలూర్​ ఎంఈవో పింజ రాజగంగారాం, నరేందర్​ తెలిపారు.  కార్య క్రమంలో హెడ్మాస్టర్ శ్యామల దేవి, రాజ సులోచన, పండరి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, టీచర్స్ పాల్గొన్నారు.