ట్యాక్స్ వసూళ్లపై ఫోకస్

ట్యాక్స్ వసూళ్లపై ఫోకస్
  • కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే  74.47 శాతం కలెక్షన్​
  • ఈ ఆర్థిక ఏడాదిలో ఇంటి పన్నుల డిమాండ్ రూ.  7 .97 కోట్లు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో 100 శాతం ఇంటి పన్నుల వసూళ్లపై యంత్రాంగం ఫోకస్​ పెట్టింది.  జిల్లాలో 535 గ్రామ పంచాయతీల్లో 2024–-25 ఆర్థిక ఏడాదిలో ఇంటి పన్నులు చెల్లించాల్సింది రూ. 7.97 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ. 6. 17 లక్షలు మాత్రమే వసూల్ అయ్యాయి.  నాన్ ట్యాక్స్‌‌‌‌ల కింద రూ. 2.71 కోట్లకు రూ. 2 కోట్లు వచ్చాయి. ఇంటి పన్నులు, ఇతర ట్యాక్స్​లు కలిపి ఇప్పటి వరకు మొత్తం రూ. 8 .19 కోట్లు కలెక్ట్ అయ్యాయి. ఆర్థిక ఏడాది మరో  45 రోజులే మిగిలి ఉండటంతో మిగతా ట్యాక్స్ వసూలుకు చర్యలు తీసుకుంటున్నారు. 

అవసరమైతే  స్పెషల్​ టీమ్స్​ ఏర్పాటు చేసి 100 శాతం పన్నులు వసూళ్లు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ, శానిటేషన్​ కార్మికుల జీతాలు, ఇతర స్టాప్​ జీతాలు,  బ్లీచింగ్, ఆఫీసు నిర్వహణ, బోర్​ మోటార్ల నిర్వహణ ఇంటి పన్నులపై ఆధారపడి ఉంటాయి.  ఇంటి పన్నులు, నీటి కుళాయి బిల్లులు, నాన్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ల లాంటి పన్నుల ద్వారానే పంచాయతీకి ఆదాయం వస్తుంటుంది. ఈ పన్నులు పూర్తి స్థాయిలో కలెక్షన్​అయితేనే  స్థానికంగా ఇబ్బందులు లేకుండా పాలన అందించటానికి వీలుంటుంది. 

పంచాయతీల్లో వసూళ్లు అయ్యే వివిధ రకాల పన్నులపై ఎప్పటికప్పుడు సంబంధిత బ్యాంక్​ అకౌంట్లలో జమ చేసి ట్రెజరీ ద్వారా ఖర్చు చేస్తున్నారు.  గతంలో ఏండ్ల తరబడి ఇంటి పన్నులు బకాయిలు ఉండేవి. కానీ పంచాయతీలకు సెక్రటరీల నియామకం తర్వాత అన్ని పంచాయతీల్లో 100 శాతం పన్నులు వసూళ్లు చేయాలని జిల్లా అధికారులు టార్గెట్ పెట్టారు. ప్రతినెలా మండలాల వారీగా పన్నుల వసూళ్లపై రివ్యూ చేస్తున్నారు.  వివిధ ధ్రువీకరణ పత్రాలు పంచాయతీ నుంచి జారీ చేసేటప్పుడు సంబంధిత ఇంటి యజమాని పన్నులు పెండింగ్ లో లేకుండా చూస్తున్నారు.

 ఇంటి పన్నులు డ్యూ ఉంటే వారి చేత కట్టిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 31కి  ఆర్థిక సంవత్సరం ముగింపు ఉన్న దృష్ట్యా అప్పటి లోగా100 శాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయటం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎక్కువగా ఇంటి పన్నులు చెల్లించని గ్రామాలు, మండలాలను గుర్తించి అవసరమైతే  స్పెషల్​ టీమ్స్​ ఏర్పాటు చేయనున్నారు.  మార్చి 2వ వారం వరకు అధిక మొత్తంలో కలెక్షన్లు ఉన్న చోట మండల పరిధిలోని పంచాయతీ సెక్రెటరీలు, ఎంపీవోలు టీమ్‌‌‌‌గా వెళ్లి కలెక్షన్ చేస్తారు. పన్నులు చెల్లించటం ద్వారానే  గ్రామాల్లో వీధి దీపాలు (స్ర్టీట్​ లైట్లు) శానిటేషన్‌‌‌‌ను సక్రమంగా చేపట్టడానికి వీలుంటుందని ప్రజలకు తెలియజేస్తూ పూర్తిస్థాయిలో పన్నులు చేయటానికి కార్యాచరణ రెడీ చేస్తున్నారు. 

లాస్ట్​లో  పెద్దకొడప్​గల్ మండలం

పన్నుల వసూళ్లలో ఎల్లారెడ్డి మండలం ఫస్ట్ ఉంది.  87.95 శాతం పన్నులు వసూళ్లయ్యాయి.  ఈ మండలంలో ఇంటి పన్నులు 24 లక్షలు, ఇతర ట్యాక్స్​లు రూ. 4 లక్షలు ఉంది.  25 లక్షలు 87వేలు కలెక్షన్​అయ్యాయి. బీబీపేట మండలంలో  మొత్తం రూ. 43 లక్షలకు గాను రూ.37 లక్షలు  ( 85.75 శాతం ) వసూళ్లు చేశారు.  పన్నుల వసూళ్లలో పెద్దకొడప్​గల్​ మండలం వెనకబడి ఉంది.  ఇక్కడ మొత్తం 14 లక్షలకు గాను  రూ. 8 లక్షలు మాత్రమే కలెక్షన్​ అయ్యాయి.  

పరిస్థితులకు అనుగుణంగా స్పెషల్ డ్రైవ్ ​

జిల్లాలో కచ్చితంగా 100 శాతం ఇంటి పన్నులు , ఇతర పన్నులను వసూళ్లు చేస్తాం. ఇప్పటికే 74 శాతం దాటింది.  మిగతా 26 శాతాన్ని మార్చి చివరి వరకు కంప్లీట్​ చేస్తాం. మార్చి ఫస్ట్​ వీక్​ వరకు పన్నుల వసూళ్లపై రివ్యూ చేసి  ఎక్కువగా బకాయిలు ఉన్న పంచాయతీల్లో స్పెషల్​ టీమ్స్​ద్వారా పూర్తి స్థాయిలో కలెక్షన్​ చేయిస్తాం.  పన్నులు పూర్తి స్థాయిలో కలెక్షన్​ అయితే గ్రామాల్లో పనులు చేపట్టానికి వీలుంటుంది. - శ్రీనివాస్​రావు, జిల్లా పంచాయతీ అధికారి