కామారెడ్డి టౌన్, వెలుగు: పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్లుగా తెలంగాణ ప్రజల పరిస్థితి ఉందని బీజేపీ కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ అరుణతార అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ ఆధ్వర్యంలో చార్జిషీట్విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అంతకు మించి ఇబ్బందులు గురి చేస్తోందన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆరు అబద్దాలు 66 మోసాలుగా సాగుతోందన్నారు. ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ఎటు పోయిందన్నారు.
రైతు భరోసా, కౌలు రైతులకు భరోసా ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. గృహజ్యోతి స్కీమ్ సరిగ్గా అమలు కాక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా రేషన్‌కార్డులు, ఫించన్లు ఇవ్వలేదని విమర్శించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. మహిళలకు రూ.2,500, విద్యార్థినులకు స్కూటీ, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు.
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, సీనియర్ నాయకులు మురళీధర్‌గౌడ్, రాష్ర్ట కార్యవర్గ సభ్యులు నీలం చిన్నరాజులు, బాణాల లక్ష్మారెడ్డి, రంజిత్‌మోహన్, పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీలు నరేందర్‌రెడ్డి, రవీందర్రావు, లీడర్లు శ్రీనివాస్, శ్రీకాంత్, లింగారావు, వేణు తదితరులు పాల్గొన్నారు.