నా చావుకు యాజమాన్యమే కారణం..సూసైడ్ నోట్లో భాస్కర్రెడ్డి

వరంగల్: వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  కనకదుర్గ చిట్ఫండ్స్ మేనేజర్ నల్లా భాస్కర్రెడ్డి ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. తన ఆత్మహత్యకు కనకదుర్గ చిట్ ఫండ్స్ యాజమాన్యమే కారణమని సూసైడ్ నోట్ లో ఆయన తెలిపారు.

కస్టమర్ల నుంచి డిపాజిట్ చేయించిన డబ్బులు ఇవ్వకుండా వేధించడంతో తాను చనిపోతున్నట్టు భాస్కర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. కనకదుర్గ చిట్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన తన కస్టమర్లకు న్యాయం చేయాలని నోట్ లో కోరారు. నిన్న హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో నల్లా భాస్కర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు.


ఆదివారం (ఫిబ్రవరి 4) హనుమకొండ నక్కల గుట్టలోని హరిత కాకతీయ హోటల్లో నల్ల భాస్కర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక సమస్యలు, చిట్ ఫండ్ పేమెంట్ల వల్ల ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఆదివారం ఉదయం భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా సమాధానం రాలేదు. మధ్యాహ్నం చెక్ అవుట్ ఇచ్చిన భాస్కర్ రెడ్డి హోటల్ రూంలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం త ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.