తమిళ్ ప్రముఖ డైరెక్టర్ శివ మరియు స్టార్ హీరో సూర్య కాంబినేషన్ లో తెరకెక్కిన కంగువ సినిమా నవంబర్ 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాని ప్రముఖ సినీ నిర్మాత జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మించాడు. కంగువ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించగా హీరోయిన్ గా దిశా పటాని నటించింది. నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళతదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
భారీ అంచనాల నడుమ రిలీజ్ అవుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా దాదాపుగా రూ.9.63 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక తమిళనాడులో మార్నింగ్ షోస్ కి పర్మిషన్ లేకపోవడంతో కొంతమేర సూర్య ఫ్యాన్స్ నిరాశకి గురయ్యారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో, కేరళలో కూడా మార్నింగ్ షోస్ కి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం కంగువ మొదటిరోజు వరల్డ్ వైడ్ గా దాదాపుగా రూ.75 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే తమిళనాడులో రోజువారీ షోస్ కంటే ఒక షో ఎక్కువ ప్రసారం చేసేందుకు పర్మిషన్స్ ఉండటంతో రిలీజ్ రోజు దాదాపుగా రూ.20 కోట్లు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.
ALSO READ | సూర్య ఫ్యాన్స్ కి తమిళనాడు గవర్నెమెంట్ బిగ్ షాక్. ఏంటంటే..?
అయితే తెలుగు రాష్ట్రాల్లో కంగువ రిలీజ్ విషయంలో కొంతమేర సందిగ్దత నెలకొన్నట్లు తెలుస్తోంది. తెలుగులో మరికొన్నిగంటల్లో ప్రీమియర్ షోస్ మొదలు కానుండగా ఇప్పటివరకూ చాలాచోట్ల టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యలేదు. అంతేగాకుండా నైజాం ఏరియాలో చాల తక్కువ థియేటర్లు కేటాయించారు. అయితే తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొన్నవారికి, అధిక థియేటర్లు కలిగిన సంస్థకి మధ్య విబేధాలకారణంగా కంగువ సినిమాకి పలు చోట్ల థియేటర్లు కేటాయించడం లేదని టాక్ వినిపిస్తోంది. ఏదైమనప్పటికీ ఈ డిస్ట్రిబ్యూటర్ల మధ్య విబేధాలకారణంగా కంగువ సినిమా ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలుస్తోంది.