
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, మోహన్ బాబు, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ లాంటి స్టార్స్ కీలకపాత్రలు పోషించారు. ముకేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, మోహన్ బాబు నిర్మించారు. ఏప్రిల్ 25న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కన్నప్ప టీం పాల్గొంది.
ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ ‘‘కన్నప్ప’ ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నా. అందర్నీ ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది. ప్రభాస్ పాత్రను ఎంత ఊహించుకున్నా.. అంతకు మించి అనేలా ఉంటుంది’ అని చెప్పాడు. తాను ఈ చిత్రాన్ని రూపొందించడం శివ లీల అన్నారు దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్. ‘కన్నప్ప’ లాంటి గొప్ప చిత్రంలో తాము నటించడం సంతోషంగా ఉందని నటులు బ్రహ్మాజీ, రఘుబాబు అన్నారు.