- భద్రాద్రి జిల్లాలో రెండు పంచాయతీల్లో తీర్మానం
- ఆఫీసర్లకు ప్రతులను అందజేసిన గ్రామస్తులు, మహిళలు
కరకగూడెం, వెలుగు : ఇక నుంచి బెల్ట్ షాపుల్లో మందు.. గుడుంబా అమ్మకాలు బంద్ పెట్టాలి. ఎవరైనా అమ్మితే రూ. 50 జరిమానా కట్టాలి” అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమల్ల, వట్టం వారిగుంపు గ్రామాల ప్రజలు నిర్ణయించారు. బెల్ట్ షాపుల్లో మందు, గుడుంబా అమ్మకాలను బంద్ పెడుతూ మంగళవారం తీర్మానించారు.
విచ్చలవిడి మద్యం అమ్మకాలతో కుటుంబాల్లో గొడవలు అవుతున్నాయని, తాగి అనారోగ్యం పాలై చనిపోవడమే కాకుండా.. ఆర్థికంగా కుటుంబాలు దెబ్బతింటూ రోడ్డున పడుతున్నాయని, ఇకముందు అమ్మకాలు చేయొద్దని ఆయా గ్రామాల్లో తీర్మానాలు చేశారు. ఎవరైనా అతిక్రమించి అమ్మితే.. రూ.50 వేల జరిమానాతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకు అధికారులు సహకరించాలని కోరుతూ కరకగూడెం తహసీల్దార్ నాగప్రసాద్ కు, ఎస్ఐ రాజేందర్ కు తీర్మాన ప్రతులను ఆయా గ్రామాల ప్రజలు, మహిళలు అందజేశారు..