ఖమ్మం జిల్లాలో గూడ్స్ రైలు ఢీ.. 11 బర్రెలు మృతి ఖమ్మం జిల్లాలో

  • ఖమ్మం జిల్లా కారేపల్లిలో ఘటన

కారేపల్లి, వెలుగు:  గూడ్స్ రైలు ఢీకొని బర్రెలు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. కారేపల్లిలోని ఓ రైతుకు చెందిన 11  పాడి బర్రెలను ఆదివారం తన వ్యవసాయ భూమిలో మేతకు వదిలాడు. రైలు కట్ట అవతలి వైపు కూడా తన బీడు భూమి ఉండడంతో అటువైపు పంపేందుకు రైలు పట్టాలు దాటిస్తున్నాడు.

ఆ సమయంలో డోర్నకల్ నుంచి ఇల్లందు వెళ్తున్న గూడ్స్ రైలు ఢీ కొట్టింది. అన్ని బర్రెలు రైలు కింద పడి చనిపోయాయి. దీంతో రూ.8 లక్షల నష్టం జరిగింది.  రైలు కింద కళేబరాలు ఇరుక్కుపోవడంతో రైల్వే సిబ్బంది తొలగించారు. మూడు గంటల పాటు ఆ లైన్ లో గూడ్స్ రైలు నిలిచిపోయింది.