సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

కరీంనగర్ క్రైం, వెలుగు: సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ సైబర్ క్రైమ్  ఏసీపీ నర్సింహారెడ్డి తెలిపారు.  సైబర్ జాగృత దివస్ సందర్భంగా  స్థానిక  ప్రభుత్వ మహిళ జూనియర్ కాలేజీలో  బుధవారం సైబర్ నేరాల నివారణ  అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ..   సమాజంలో రోజురోజుకీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయని అన్నారు.  బాధితుల్లో ఎక్కువగా అవగాహన లేక వ్యక్తిగత సమాచారం అందించి మోసపోతున్నారన్నారు.  రివ్యూ రేటింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, బెట్టింగ్ ఫ్రాడ్ లాంటి మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్నారని అన్నారు.  ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ నిర్మల, ఇన్స్పెక్టర్ సునీల్,  సబ్ ఇన్స్పెక్టర్ జ్యోష్ణ పాల్గొన్నారు.