ఉత్కంఠగా కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్.. ముగ్గురి మధ్య హోరాహోరీ

ఉత్కంఠగా కరీంనగర్  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్.. ముగ్గురి మధ్య హోరాహోరీ

కరీంనగర్  మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్  నెమ్మదిగా జరుగుతోంది . మొదటి ప్రాధాన్య ఓట్లను లెక్కింపు కొనసాగుతోంది . మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్క తేలేందుకు ఎనిమిది గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.   బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థుల మధ్య హోరాహోరి పోరు ఉంది.  మార్చి 4న రాత్రి 8:30 వరకు మొదటి ప్రాధాన్య ఓట్ల ఫలితంపై క్లారిటీ రానుంది.  కౌంటింగ్ కోసం మొత్తం 800 మంది సిబ్బందిని నియమించినప్పటికీ.. తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఎన్నికల సంఘం, కలెక్టర్‌‌‌‌ పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్  తరపున అల్ఫోర్స్  నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి అంజిరెడ్డి అన్నారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ బరిలో ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఓట్లు 3.55 లక్షలకు గానూ 2,50,106  ఓట్లు పోలవ్వగా ఇందులో 40 వేలకు పైగా ఓట్లు చెల్లనివిగా గుర్తించారు అధికారులు.

టీచర్ ఎమ్మెల్సీలుగా మల్క కొమురయ్య, శ్రీపాల్ రెడ్డి

  కరీంనగర్‌‌- – మెదక్‌‌ – నిజామాబాద్‌‌ -– ఆదిలాబాద్‌‌ టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య విజయం సాధించారు. వరంగల్– ఖమ్మం– నల్గొండ టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్​రెడ్డి గెలుపొందారు. మల్క కొమరయ్య మొదటి ప్రయార్టీ ఓట్లతోనే గెలిచారు. వరంగల్–ఖమ్మం-–నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొదటి ప్రయార్టీ ఓట్లతో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రయార్టీ ఓట్ల కౌంటింగ్​తో శ్రీపాల్​రెడ్డి విజయం సాధించారు. 

Also Read:-మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..