- స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు
- ఓపెనింగ్‌కు రెడీ చేసిన ఆఫీసర్లు
- తొలి విడతలో యూనివర్సిటీ, కలెక్టరేట్ ఏరియాల్లో..
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ సిటీలో ఇక అర్ధరాత్రి రాత్రి కూడా ఫుడ్దొరకనుంది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా సిటీలో నైట్ఫుడ్బజార్లు ఏర్పాటు చేయనున్నారు. తొలివిడతలో శాతవాహన యూనివర్సిటీ, కలెక్టరేట్ఏరియాలో వీటిని ఓపెన్ చేసేందుకు రెడీ చేశారు. కరీంనగర్‌లోనూ వీకెండ్ కల్చర్ పెరుగుతుండడంతో ఆహ్లాదం కోసం ఫ్యామిలీస్బయటకు వస్తున్నాయి. కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జితోపాటు ఎల్ఎండీ, ఉజ్వల పార్కు, డీర్ పార్క్ వంటి పర్యాటక ప్రాంతాల్లో జనం తాకిడి పెరుగుతోంది.
ఇలా బయటకు వెళ్లి చాలా మంది అర్ధరాత్రిగానీ ఇంటికి చేరుకోవడం లేదు. ఇప్పటివరకు రాత్రి 10 అయితే హోటళ్లు, టిఫిన్ సెంటర్లు మూతపడుతుండేవి. ఇక నుంచిలేట్ నైట్‌లో ఫుడ్ తినాలనుకునేవారి కోసం నైట్ఫుడ్బజార్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిని వచ్చేవారంలో ఓపెనింగ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.
తొలివిడత ఓపెనింగ్‌కు రెడీ
స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ సిటీలో నైట్ ఫుడ్ బజార్లను ఏర్పాటు చేయాలని 2021లోనే బల్దియా నిర్ణయించింది. ఇందుకోసం శాతవాహన యూనివర్సిటీ సమీపంలో, కలెక్టరేట్ నుంచి మమత థియేటర్ మధ్య, మల్టీపర్పస్ స్కూల్ పార్కు సమీపంలోని బస్ బే ఎదురుగా, ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ రోడ్డు, మార్క్‌ఫెడ్, ఆర్టీసీ జోనల్ వర్క్‌షాప్, ఉజ్వలపార్కు వంటి ఏరియాలను కూడా గుర్తించారు. రూ. కోటిన్నర నుంచి రూ.2 కోట్ల అంచనాతో సిటీలో రద్దీగా ఉండే ఈ ప్రాంతాల్లో నైట్ బజార్, ఫుడ్ కోర్టులను ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే శాతవాహన యూనివర్సిటీ మెయిన్ ఎంట్రెన్స్ నుంచి శ్రీరాంనగర్ కాలనీ రోడ్డు నెం.7 వరకు రూ.కోటి వెచ్చించి కుడివైపు ఫుట్‌పాత్‌ను అభివృద్ధి చేశారు.
టైల్స్ వేయడంతోపాటు యూనివర్సిటీ కాంపౌండ్ వాల్‌పై పెయింటింగ్స్ వేశారు. లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ 4 వెజ్ ఫుడ్ స్టాల్స్, 4 నాన్ వెజ్ ఫుడ్ స్టాల్స్, 4 గజిబోలు, లైటింగ్, అధునాతన వాష్ రూమ్స్ సిద్ధం చేశారు. సీటింగ్, తాగునీరు, పూల చెట్లతో కూడిన పార్కు, పిల్లలకు ఆట స్థలం, వెహికిల్ పార్కింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నారు.
స్పందన బాగుంటే సిటీ నలువైపులా..
కరీంనగర్ సిటీ ప్రజల అభిరుచులు, లైఫ్ స్టైల్ గతంతో పోలిస్తే చాలా మారిపోయింది. వీకెండ్స్, సెలవు రోజుల్లో ఆహ్లాదం కోసం కుటుంబసభ్యులతో కలిసి బయటకు వెళ్తున్నారు. రాత్రి 10 దాటితే సిటీలో ఫుడ్ దొరకడం లేదు. అందుకే రాష్ట్రంలోనే ఫస్ట్ టైం కరీంనగర్‌లో నైట్‌బజార్ కమ్ ఫుడ్‌కోర్టులను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే శాతవాహన యూనివర్సిటీ సమీపంలో లైటింగ్ మినహా ఫుడ్ కోర్టు పనులన్నీ పూర్తయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే ప్రారంభిస్తాం. స్పందన బాగుంటే సిటీ నలువైపులా విస్తరిస్తాం.
- యాదగిరి సునీల్ రావు, మేయర్